»Wife Among Four Arrested For Singareni Employees Murder
murder : సింగరేణి రిటైర్డ్ భర్తను హత్య చేయించిన భార్య
మద్యం తాగొచ్చి రోజూ గొడవకు దిగుతున్న భర్తను భార్య దారుణంగా హత్య చేయించింది. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి అయిన ఆ వ్యక్తిని ఈ నెల 9వ తేదీన నలుగురు యువకులు హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ex singareni employee murder : సింగరేణిలో ఉద్యోగిగా పని చేసిన రిటైర్ అయిన గజెల్లి పోషం అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. వయసు మీద పడటం, మద్యానికి బానిసవడం వల్ల తాగి వచ్చి భార్య లక్ష్మితో గొడవ పడేవాడు. ఓ ప్లాట్ అమ్మకం విషయంలో ఇద్దరి మద్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో విసుగు చెందిన భార్య అతడిని హత్య చేయించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈ భార్యా భర్తల మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె ఇంటిని వదిలి హైదరాబాద్‌లోని వృద్ధాశ్రమంలో ఉండటానికి వెళ్లింది. కొంత కాలానికే తిరిగి వచ్చి కరీంనగర్లో అద్దె ఇల్లు తీసుకుని నివసిస్తోంది. ఇది తెలిసిన పోషం అక్కడికి వెళ్లి ఆమెతో గొడవ పడ్డాడు. రిటైర్మెంట్ అప్పుడు వచ్చిన డబ్బుతో హనుమకొండ దగ్గరలో పోషం ఒక ప్లాట్‌ని కొన్నాడు. దాన్ని ఇప్పుడు అమ్మకానికి పెడతున్నట్లు తెలిపాడు. అది ఇష్టం లేని భార్య గొడవ పడింది. ఈ విషయంలో వారిద్దరి మద్య వాదనలు నడిచాయి. దీంతో విసిగిపోయిన లక్ష్మి కరీంనగర్లో తనకు పరిచయం ఉన్న ఓ మైనర్ బాలుడికి సంగతంతా చెప్పింది. తన భర్తను చంపితే(Murder) లక్ష రూపాయలు ఇస్తానని చెప్పింది.
డబ్బులకు ఆశ పడిన ఆ మైనర్ బాలుడు తన స్నేహితులతో కలిసి పోషంను చంపేందుకు ప్లాన్ వేశాడు. తాము ప్లాట్ కొనుక్కోవడానికి వచ్చామని చెప్పి పోషంని వారు తీసుకెళ్లారు. అది చూసిన తర్వాత మద్యం తాగడానికి వెళదామన్నారు. తాగి పడిపోయిన పోషంపై దాడికి దిగారు. అతడు చనిపోయాడని నిశ్చయించుకున్నాక అక్కడి నుంచి పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు కాల్ లిస్ట్‌ల ఆధారంగా దర్యాప్తు చేశారు. భార్య లక్ష్మి సహా మరో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారిలో నలుగురు మైనర్లు ఉండటం గమనార్హం.