పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి. చాలా కాలంగా షూటింగ్ ఆగిపోయి ఉన్న ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్నారు.
Harihara Veeramallu: పవన్ ఫ్యాన్స్ దాదాపుగా హరిహర వీరమల్లు సినిమాను మర్చిపోయినంత పనైంది. ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ లేదనుకున్నారు. అసలు ఉంటుందా? అనే డౌట్స్ కూడా ఉండేవి. కానీ ఎట్టకేలకు ఈ మధ్యనే హరిహర వీరమల్లు సినిమా ఆగిపోలేదు.. గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నాయి.. ఎలక్షన్స్ తర్వాత షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చాడు నిర్మాత ఏఎం.రత్నం. అలాగే.. స్పెషల్ ప్రోమో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే.. ఈ స్పెషల్ ప్రోమో మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఇప్పుడు దాదాపుగా కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. దీంతో వీర వచ్చేస్తున్నాడు.. పవన్ ఫ్యాన్స్ అంతా యాక్టివ్ కావాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.
ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది హరిహర వీరమల్లు. పవన్ ఆర్మీ.. ఈ స్పెషల్ ప్రోమో కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. పవన్ ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా అనౌన్స్ అయిన హరిహర వీరమల్లు పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో క్రిష్ పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాలని చూస్తున్నాడు. కానీ సినిమా షూటింగ్ మాత్రం కంప్లీట్ అవడం లేదు. హరిహర వీరమల్లు స్టార్ట్ అయిన తర్వాత ప్రకటించిన సినిమాలు.. భీమ్లా నాయక్, బ్రో సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ వీరమల్లు మాత్రం రోజురోజుకి వెనక్కి వెళ్తునే ఉంది. కానీ ఎలక్షన్స్ తర్వాత పవన్ డేట్స్ ఇస్తే కంప్లీట్ చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. మరి ఇప్పటికైనా స్పెషల్ ప్రోమో రిలీజ్ చేసి.. ఫ్యాన్స్‌కు మంచి విజువల్ ట్రీట్ ఇస్తారేమో చూడాలి.