»It Is Certain That Revanth Reddy Will Be The Target Of The Bjp After The Next Parliamentary Elections
KTR : పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్ రెడ్డి : కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోవటం ఖాయమన్నారు. మరో ఏక్‌నాథ్‌షిండే..
KTR : సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోవటం ఖాయమన్నారు. మరో ఏక్‌నాథ్‌షిండే.. మరో హిమంతబిశ్వశర్మ ఇక్కడే పుడతడు. కాంగ్రెస్‌ను బొందపెడ్తడు. ఆషామాషీగా చెప్తలేను. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతోనే చెప్తున్నా. మోడీ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలే చెప్తున్నాయని అన్నారు.
గురువారం తెలంగాణ భవన్లో కరీంనగర్ పార్లమెంట్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 90 రోజుల్లోనే ప్రజల అభిమానాన్ని కోల్పోయిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన పక్కనబెట్టి నోటికొచ్చినట్లు అబద్ధాలు ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ అట్టర్ ప్లాప్ అంటే.. రేవంత్ రెడ్డి గుజరాత్ మోడల్‌ను గొప్పగా పొగుడుతున్నారంటూ విమర్శించారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే రావాలని పరోక్షంగా రేవంత్ రెడ్డి కోరుకుంటున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి 15 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి వెళ్ళిపోతాడన్నారు.
కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పథకాలను కాపీ కొట్టిందంటూ ఎద్దేవా చేశారు. రైతుబంధును కాపీ కొట్టి పీఎం కిసాన్ అని పెట్టుకున్నారు. మిషన్ కాకతీయను కాపీ కొట్టి అమృత్ సరోవర్ అని పెట్టుకున్నారు. అలాంటి గుజరాత్ ను రేవంత్ రెడ్డిని ప్రశంసించడం దారుణమన్నారు. హిందువులు, ముస్లింలు కలిసి ఉండొద్దనేది గుజరాత్ నినాదమని.. అందుకే నిత్యం గొడవలు జరిగేలా ప్లాన్ చేస్తారని అన్నారు. రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే కాంగ్రెస్‌లో కొనసాగేలా కనిపించడం లేదని అనుమానం వ్యక్తం చేశారు.