The cause of MLA Lasya Nandita's death was tipper. The driver was on the run
MLA Lasya: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓఆర్ఆర్ రోడ్లులో జరిగిన ఈ యాక్సిడెంట్లో ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణిస్తున్న కారును ఓ టిప్పర్ ఢీ కొట్టడంతో, కారు అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. టిప్పర్ నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. అయితే లాస్య నందిత డ్రైవర్ అవినాష్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా కారు అదుపు తప్పింది, ఆ తరువాత ఏం జరిగిందో తనకు తెలియదు అని అన్నారు.
డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న లాస్య సీటు బెల్టు పెట్టుకుని ఉంటే గాయాలతో బయటపడేది అని పోలీసులు తెలిపారు. అయితే వెనుకనుంచి టిప్పర్ డ్యాష్ ఇవ్వడంతోటే ఈ ప్రమాదం జరిగిందిని, అయితే డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే చిన్న వయసులోనే మరణించడంపై పార్టీ నేతలు, కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత ఆక్సిడెంట్ అప్డేట్
లాస్య నందిత కారు ఢీకొట్టిన టిప్పర్ను గుర్తించిన పోలీసులు.. పరారీలో ఉన్న టిప్పర్ డ్రైవర్. pic.twitter.com/s9wc1m0vqz