»Rahul Gandhi Rahul Granted Bail In Defamation Case
Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్ మంజూరు!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి యూపీ కోర్టులో ఊరట లభించింది. 2018లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై 2018లో చేసిన అభ్యంతర వ్యాఖ్యలకు పరువు నష్టం కేసులో ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్ జిల్లా కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది.
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి యూపీ కోర్టులో ఊరట లభించింది. 2018లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై 2018లో చేసిన అభ్యంతర వ్యాఖ్యలకు పరువు నష్టం కేసులో ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్ జిల్లా కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా రాహుల్ ప్రస్తుతం యూపీలో ఉన్నారు. కేసు విచారణ నిమిత్తం కోర్టు ఎదుట హాజరయ్యారు. 2018లో మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాహుల్ కేంద్రమంత్రి అమిత్‌షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో స్వచ్ఛంగా, నిజాయితీగా ఉంటామని చెప్పే బీజేపీ ఓ హత్య కేసులో నిందితుడిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుందని ఆరోపించారు. ఆ సమయంలో అమిత్ షా బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. దీంతో బీజేపీకి చెందిన విజయ్ మిశ్రా రాహుల్‌పై ప్రత్యేక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో ఫిర్యాదు చేశారు. గతంలో చాలాసార్లు న్యాయస్థానం రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన స్పందించలేదు. తాజాగా విచారణకు హాజరవ్వగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.