»Womans Dance On A Plane Goes Viral Embarrasses Desis Online
Viral News: గాల్లో విమానం.. యువతి డ్యాన్స్.. వీడియో వైరల్
ఫ్లై అవుతున్న విమానంలో ఓ యువతి డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ మధ్య ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. మెట్రోల్లో, రైళ్లలో యువతియువకులకు హద్దులు లేకుండా పోయాయి.
దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
Woman's Dance on a Plane Goes Viral, 'Embarrasses' Desis Online
Viral News: మెట్రోల్లో, రైళ్లలో డ్యాన్స్(Dance) చేయడం హద్దులు దాటడం అనుకుంటే తాజా దృశ్యం అంతకు మించి అని చెప్పాలి. కదిలే విమానంలో ఓ లేడి ప్యాసింజర్ నృత్యం చేసింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ మధ్య యువత రీల్స్ మోజులో పడ్డారు. దాంతో వారు ఏం చేస్తున్నారో ఆలోచించడం లేదు. తోటి ప్రయాణికుల పరిస్థితి తెలుసుకోకుండా ఇళా డ్యాన్స్ చేయడం ఏంటని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
వీడియోలో చూసినట్లైతే చిక్ బ్లాక్ క్రాప్ టాప్, లావెండర్ ప్యాంటు ధరించిన ఓ యువతి ‘కిన్ని కిన్ని’ పాటకు డ్యాన్స్ చేస్తూ మైమరిచిపోతుంది. ఫ్లైట్ మధ్య చాలా ఇరుకైన ప్రదేశం ఉంటుంది. దానిలో నడవడానకే శ్రమ పడాలి, అలాంటిది ఆమె నృత్యం చేస్తోంది. ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోకు చాలా విచిత్రమైన కామెంట్లు వస్తున్నాయి. ఈ వైరస్ ఆకాశాన్ని తాకింది, DGCA సరైన టీకాను కనుగొంటుందని ఆశిస్తున్నాము అని ఓ ప్రయాణికుడు కామెంట్ చేశాడు. ఇలాంటి పిచ్చి పనులు చేసే వారిని ఊరికే వదిలేయకూడదు అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
Appears the Reels Nautanki is taking Wings…
Even Planes passengers aren't spared of this nonsense…