»Viral Video Chinese Man Buys A Noodle Shop After Insulting Him For Not Being Able To Afford It
Viral Video: నీవల్ల కాదన్నారు..షాప్ మొత్తం కొనేశాడు..చివరకు
స్ట్రీట్ మార్కెట్లో ఓ నూడిల్స్ షాప్ యజమాని ఓ కస్టమర్‌ను అవమానించాడు. దాంతో కోపొద్రేకుడైన వ్యక్తి షాపులో ఉన్న అన్ని నూడిల్స్ కొని కింద పడేశాడు. ఓ షాపులో జరిగిన వింత సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Viral video Chinese man buys a noodle shop after insulting him for not being able to afford it.
Viral News: చైనా(China)లోని ఓ రోడ్డు పక్కన నూడిల్స్ షాప్(Noodles Shop) వద్ద జరిగిన వింతైన సంఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి కొన్ని ప్యాకెట్లను నేలకేసి కొడుతు వాటిని నాశనం చేస్తున్నాడు. ఇదేమి పాడుబుద్ది అన్నట్లు ఉన్న ఈ సంఘటన వెనుక ఓ పెద్ద స్టోరీనే ఉంది. మనిషి ఏదైనా తీసుకుంటాడు. కానీ అవమానాన్ని భరించలేడు. ఈ ఘటనకు కారణం కూడా ఇదే.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌లో వైరల్‌గా మారుతున్న కథనం ప్రకారం..ఓ వ్యక్తి షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని(Shandong Province) నైట్ మార్కెట్‌ను సందర్శించడానికి వెళ్లినప్పుడు అతనికి సాధారణంగా ఆకలేసింది. దాంతో స్ట్రీట్ మార్కెట్లో విక్రయిస్తున్న ఓ నూడిల్స్ షాప్ వద్దకు వెళ్లాడు. మాములుగానే ప్లేటు ఖరీదు అడిగాడు. షాప్ అతను ఒక బౌలుకు 14 యావాన్లుగా(రూ.164) బదులిచ్చాడు. చాలా ఎక్కువగా ఉందని సదరు వ్యక్తి తిరిగి అన్నాడు. విక్రేత ఏదో చెబుతుండగా..షాపులో ఉన్న ఇతర పదార్థాల రేట్లు అడుగుతున్నాడు
కస్టమర్. అతనికి బదులుగా సమాధానం చెబుతున్నాడు ఓనర్.
దాంతో కేవలం ఒక గుడ్డు(egg), రెండు ఆకు కూరలను ఉపయోగిస్తూ..ఒక్కో ప్లేటుకు 14 యువాన్లు ఎక్కువ కాదా అని అన్నాడు. దానికి షాప్ ఓనర్ బదులివ్వకుండా, మీరు వేరే దగ్గర కొనుక్కొని తినండని, ఇక్కడి నుంచి వెళ్లిపోవల్సిందిగా చెప్పాడు. అతని మాటలు పట్టించుకోకుండా అధిక ధర గురించి ఏక దాటిగా ప్రశ్నలు గుప్పిస్తున్నాడు. ఇదంతా గమనిస్తున్న యజమాని కుమారుడు విసుగు చెంది..ఇష్టం ఉంటే కొనండి లేదా వెళ్లిపోండి. మీకు స్థోమత లేనప్పుడు ఇలా విసిగించడం ఎందుకు అనే అర్థం వచ్చేలా మాట్లాడాడు. అతని మాటలకు ఆగ్రహించిన కస్టమర్.. మొత్తం షాపులోని నూడిల్స్ పాకెట్ల ధర ఎంత అని వాటిని మొత్తం కొనుగోలు చేశాడు. ఆ తర్వాత 850 యువాన్లు (రూ. 9,920) చెల్లించి,
ఆ ప్యాకెట్లను నేలపై విసిరాడు. ఇక భూతులు తిడుతూ ఫుడ్ అంతా వృథా చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది అలా ఈగోకు పోయి ఆహారాన్ని పాడు చేయడం ఎందుకని కొప్పడుతున్నారు. మరికొందరు రేట్లపై ఎకరువు పెడుతున్నారు.
On July 24, in Linyi, Shandong Province, a man questioned that instant noodles at RMB 14 were too expensive, and was ridiculed by the stall owner. If he couldn't afford it, go away.Anger spent 850 RMB to buy it all. #ChinaNews#中国新闻pic.twitter.com/wyjauIIXma