చాలామంది ఏకపత్నీవ్రతులు ఉంటారు. అంటే ఒకరే భార్య. ఒక భార్య, పిల్లలను సాదటానికే తల ప్రాణం తోకకు వచ్చే రోజలు ఇవి. ఎండలు మండినట్టే ఈరోజుల్లో దేని ధర చూసుకున్నా మండుతోంది. ఈ నేపథ్యంలో చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అన్న రీతిలో నేటి జనాలు బతుకుతున్నారు. కానీ.. ఒక చోట ఓ వ్యక్తికి 12 మంది భార్యలు ఉన్నారు. రాజుల కాలంలో అంతమంది భార్యలను మెయిన్టెన్ చేసేవారు కానీ.. ఈరోజుల్లో అంతమంది భార్యలను చేసుకొని ఎలా మెయిన్టెన్ చేయడం అని అంటారా? అయితే.. మీరు ఆ వ్యక్తి దగ్గర ట్రెయినింగ్ తీసుకోవాల్సిందే. దాని కోసం ఉగండా వెళ్లాల్సిందే. ఆఫ్రికాలోని ఉగండాకు చెందిన ముస హసహ్య కసేరా అనే వ్యక్తి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. ఆయనకు 12 మంది భార్యలు. 102 మంది పిల్లలు. అందులో సగం మంది పేర్లు కూడా ఆయనకు గుర్తు లేవు.
102 మంది పిల్లలే కాదు.. వాళ్లకు పుట్టిన 578 మంది మనవళ్లు, మనవరాళ్లు కూడా ఈయనకు ఉన్నారు. అంటే ఇంచుమించుగా ఒక ఊరు మొత్తం ఈయన ఫ్యామిలీనే అన్నమాట. ఆ ఊరంతా ఈయన పిల్లలే అన్నమాట. ప్రస్తుతం ఆయన వయసు 68 ఏళ్లు. ఉగండాలోని బుటతెజా జిల్లాలోని బుగిస అనే గ్రామంలో ఈ పెద్దాయన ఉంటాడు. అంతమంది భార్యలు, పిల్లలను సాదలేక నరకయాతన అనుభవించాడట ముస.
12 మంది భార్యలతో సంసారం చేసి అంతమంది పిల్లలను కన్నాక వాళ్లను సాదడం ఏలాగో తెలియక తల పట్టుకున్నాడట బుస. అందుకే ఇక నుంచి పిల్లలను కనను అని ఫిక్స్ అయ్యాడట. 12 మంది భార్యల్లో ఇప్పటికే ఇద్దరు భార్యలు ఆయన్ను వదిలేసి వెళ్లిపోయారట. వాళ్లకు మూడు పూటలా తిండి కూడా పెట్టకపోవడంతో ఆయన్ను వదిలేశారట ఇద్దరు.
1972 లో ఈయన తన ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడట. అయితే.. వాళ్లది చాలా చిన్న కుటుంబం అట. వాళ్ల వంశాన్ని పెంపొందించడానికి, వాళ్ల తాత చెప్పినట్టుగా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకొని ఎడా పెడా పిల్లలను కనేశాడట ముస. అప్పట్లో మనోడికి బాగా ఫాలోయింగ్ ఉండేదట. అందుకే చాలామంది తమ కూతుళ్లను ఇచ్చి పెళ్లిళ్లు చేశారట. 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయిలను కూడా ముస పెళ్లి చేసుకున్నాడట. ఇప్పుడు తన భార్యల్లో అత్యంత తక్కువ వయసు ఉన్న భార్య వయసు 35. ఆయన భార్యలు, కొందరు కొడుకులు, కూతుళ్లు పని చేస్తూ ఆ ఫ్యామిలీని పోషిస్తున్నారట. మీకు ఇంకో విషయం తెలుసా? ఈయన ఫ్యామిలీ మొత్తం ఇప్పటికీ కలిసే ఉంటుంది. కొందరు మాత్రం పనిరీత్యా దూర ప్రాంతాలకు వెళ్లినా మిగితా వాళ్లు అందరూ ఒకే చోట ఉంటారట. అది ఈ మూస ఫ్యామిలీ స్టోరీ. మొత్తానికి వంశాన్ని మాత్రం బాగానే వృద్ధి చేశాడు.