viral video: అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పడవలో కూర్చున్న మత్స్యకారుడిపై షార్క్ దాడి చేసింది. ఈ వీడియోలో మత్స్యకారుడు తన చేతిని నీటిలో ఉంచినప్పుడు, షార్క్ ఆ వ్యక్తిపై దాడి చేస్తుంది. ఆ తర్వాత జరిగింది చూస్తే షాక్ తింటారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఫ్లోరిడాలోని నేషనల్ ఎవర్గ్లేడ్స్ పార్క్లోనిది. ఇందులో ఒక వ్యక్తి పడవపై కూర్చొని అకస్మాత్తుగా నీటిలో చేతులు కడుక్కోవడం ప్రారంభించాడు. ఇంతలో ఓ షార్క్ అతనిపై దాడి చేసి చేతులు కొరికేసింది. వీడియోలో నొప్పితో కేకలు వేయడం కూడా మీరు వినవచ్చు.
ఇది మాత్రమే కాదు.. షార్క్ వ్యక్తిని నీటిలోకి లాగుతుంది. అతికష్టమ్మీద ప్రాణాలు కాపాడుకుని బయటకు వస్తాడు. షార్క్ దాడి కారణంగా ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో రెస్క్యూ టీమ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుంటుంది. అతడిని విమానంలో ఆసుపత్రికి తరలిస్తారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.