Longyearbyen City: భూమి మీద చావు పుట్టుకలు సహజం. ప్రకృతి నియమాలను మార్చే ప్రదేశాలు ఉన్నాయని మీకు తెలుసా. భూమి మీద వంద సంవత్సరాలకు పైగా చావు ఎరుగని ప్రదేశం ఉంది. అక్కడ గత వందేళ్లుగా ఎవరూ చనిపోలేదు. నార్వే దేశంలో లాంగ్ ఇయర్బైన్. మే నుంచి జూలై వరకు ఇక్కడ సూర్యుడు అస్తమించడు. దీని కారణంగా నార్వేని మిడ్నైట్ సన్ అని కూడా పిలుస్తారు. చాలా రోజులు చల్లగా ఉంటుంది. ఎంతలా అంటే జీవి శరీరంలో ప్రవహించే రక్తం గడ్డకట్టేంత చల్లగా ఉంటుంది.
క్రైస్తవ మతాన్ని నమ్మే చాలా మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. వారి మత ఆచారం ప్రకారం ప్రజలు మరణించిన తర్వాత వారి శరీరాలను ఖననం చేస్తారు. భూమిలో పాతి పెడతారు. ఇక్కడ చలి ఎక్కువగా ఉండడం వల్ల శరీరం కుళ్లిపోదు. 1917 సంవత్సరంలో ఇక్కడ ఒక వ్యక్తి ఇన్‌ఫ్లుయెంజాతో బాధపడుతున్నాడని.. అతను ఈ వ్యాధి కారణంగా మరణించాడని.. అతన్ని అక్కడే ఖననం చేశారు. చాలా ఏళ్ల తర్వాత కూడా ఆ వైరస్ అతని మృతదేహంలో ఉందని చెబుతారు. తర్వాత ఈ నగరాన్ని అంటువ్యాధి నుంచి రక్షించడానికి ఇక్కడ పాలకులు వారి మరణాలను ఆపడానికి ఆ వ్యక్తిని హెలికాప్టర్లో వేరే ప్రదేశానికి పంపి అక్కడే అతడి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో 2000 జనాభా ఉండే ఆ నగరంలో ఇప్పటి వరకు మరణాలు సంభవించలేదు. చదవండి:Dangerous Poison: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషం.. కనుగొన్న శాస్త్రవేత్తకు నోబెల్ ప్రైజ్