విలాసాలకు, తప్పుడు పనులకు అలవాటుపడ్డ ఓ బ్యాంకు ఉద్యోగి దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. ఆ క్రమంలో అతని ఉద్యోగం పోయింది. అయినా వదలకుండా దొంగతనాలు చేస్తునే ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ పట్టుబడ్డాడు.
బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ ( Bank Assistant Manager ) పనిచేసిన వ్యక్తి దొంగగా మారాడు. బ్యాంకులోని లాకరులో ఉన్న నగలు, పక్కింట్లో దొంగతనం అంటూ చెలరేగాపోయాడు. కాకినాడ జిల్లా డీఎస్పీ కె.లలితకుమారి వెళ్లడించిన వివరాల ప్రకారం… అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం పీనారిపాలేనికి చెందిన చిటికెల నాగేశ్వరరావు అనేవ్యక్తి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఆలమూరు మండలం నర్సిపూడి నిమర్రులలోని ఓ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజేజరుగా పనిచేశాడు. నిడమర్రులో తాను విధులు నిర్వర్తిస్తున్న బ్యాంకులోనే లాకర్ లో బంగారాన్ని దొంగిలించి అమ్మివేయడంతో సస్పెండ్ అయ్యాడు. అదిచాలదనక.. ఏలేశ్వరంలో ఏకంగా ATM చోరీకి పాల్పడ్డాడు. అన్నవరంలో ఓ ఇంట్లో దొంగతనం చేశాడు. తాను ఉంటున్న ఏరియాలోని ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకున్నాడు. మే నెల 12వ తేదీ అర్ధరాత్రి అన్నవరం సత్యదేవ జూనియర్ కాలేజీ వెనకాల ఉన్న ఓ ఇంట్లో దొంగతనం చేసి సుమారు 33.8 కాసుల బంగారాన్ని, 1.5 కేజీల వెండి వస్తువులను, 50వేల నగదుతో పాటు.. మొత్తం రూ.22.44 లక్షల విలువైన సొత్తును దొంగిలించాడు. పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడంతో జైలు పాలయ్యాడు. బెయిల్ పై బయటకు వచ్చి అన్నవరంలోని ఓ ఇంట్లో మళ్లీ దొంగతనానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి నగలను స్వాదీనం చేసుకున్నారు.