»Peanut Chikki Making Viral Video Think Twice Before That
Peanut chikki: ఈ వీడియో చూశాక..పల్లి పట్టి తినాలంటే ఆలోచిస్తారు!
వేరుశెనగ పల్లిపట్టిలు చాలా ఆరోగ్యకరమని అనేక మందికి తెలుసు. వీటిని తినడం ద్వారా ప్రొటీన్లతోపాటు పలు పోషకాలు లభిస్తాయి. అయితే ఎంతో మందికి ఇష్టమైన ఈ పల్లిపట్టిలు దారుణంగా తయారు చేస్తున్న ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఇది చూస్తే మీరు వాటిని మళ్లీ తినకూడదని అనుకుంటారు.
peanut chikki making viral video think twice before that
వేరుశనగ పల్లిపట్టిలు(peanut chikki) సాధారణంగా అనేక మందికి ఇష్టముంటుంది. వీటిలో ప్రోటీన్లు కూడా ఎక్కువ కాబట్టి పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరూ తింటారు. అయితే ఈ పల్లిపట్టిలను తయారు చేసే ఓ షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో చాలా అపరిశుభ్ర వాతావరణంలో వాటిని తయారు చేస్తుండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో ఇటివల ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా.. 27 మిలియన్ల మందికిపైగా వీక్షించారు.
అయితే వీడియోలో వేరుశెనగ, బెల్లం మిశ్రమాన్ని చిక్కీలుగా తయారు చేసేందుకు ఓ వ్యక్తి బ్లాక్ బ్లేడ్ లాంటి సాధనాన్ని ఉపయోగించి చిన్న ముక్కలుగా కత్తిరిస్తున్నాడు. ఇక ఆ ముక్కలను దీర్ఘచతురస్రాకార ఫ్రేమ్లలోకి మార్చడానికి అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వాటిని నేలకేసి విసురుతున్నారు. ఇంకో వ్యక్తి వాటిని నేలపైనే ఉంచి ఆకారం రావాలని అదుముతున్నాడు. మరోవ్యక్తి రోలింగ్ సాధనంతో ఆకారంలోకి మార్చుతున్నాడు. ఇలా వారు ఈ మొత్తం ప్రక్రియను తయారు చేసే విధానం చాలా భయంకరంగా ఉంది.
You might be munching on this peanut chikki right now in winters. And some one might have sold you saying its gur ki chikki not sugar so it’s healthy.
అక్కడి కార్మికులు ఎటువంటి పరిశుభ్రతా చర్యలు పాటించడం లేదు. కనీసం చేతి తొడుగులు కూడా ధరించడ లేదు. ఈ తతంగం మొత్తం నేలపైనే చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్లు పల్లిపట్టి తయరీ విధానంపై ఆందోళనను వ్యక్తం చేశారు. మరోక వ్యక్తి అయితే ఓ మై గాడ్..ఇక నేను ఇంట్లోనే దీనిని తయారు చేసుకుంటానని కామెంట్(comments) చేశాడు. ఇంకొంత మంది కూడా ఇంత ఘోరంగా తయారు చేయడమెంటని ప్రశ్నిస్తున్నారు. అసలు ఇది ఎక్కడ తయారు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.