HYD: గణేశ్ నిమజ్జనం పూర్తయిన నేపథ్యంలో రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆమ్రపాలి కాట అధికారులను ఆదేశించారు. శనివారం జోనల్ కమిషన్లు, అడిషనల్ కమిషనర్లు, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు నగరంలోని వీధుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు.