వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శుక్రవారం వర్దన్నపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సమగ్ర ఇంటింటి సర్వేపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ విధి విధానాలను తెలిపారు.