ADB: రాష్ట్ర సంత్ శ్రీ తుక్డోజి మహారాజ్ పుణ్య తిథి మహోత్సవాన్ని ఘనంగా జరపనున్నట్లు నిర్వాహకులు మోతిరాం తెలిపారు. ఆదిలాబాద్‌లోని ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. మహారాష్ట్రలోని అమరావతిలోని శ్రీ తుక్డోజి మహారాజ్ ఆశ్రమంలో ఈనెల 21 తేదిన నిర్వహించే ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి భారీగా భక్తులు పాల్గొంటారని తెలిపారు.