SRPT: తుంగతుర్తి మండలం వెంపటి ప్రాథమిక పాఠశాలలో శనివారం తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించారు. సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట్రామనర్సమ్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు చూడాలని సూచించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, ప్రవర్తనలో రావాల్సిన మార్పులపై చర్చించారు.