NGKL: ఆరోగ్య పథకాల వివరాలు నమోదులో నిర్లక్ష్యం వహించరాదని నాగర్ కర్నూల్ పిపి యూనిట్ వైద్యాధికారి అభిరామ్ ఆశావర్కర్లకు సూచించారు. మంగళవారం పీపీ యూనిట్ పరిధిలోని ఆశావర్కర్లకు వైద్యులు కీర్తన, మానస రికార్డులను అందజేశారు. వైద్యులు మాట్లాడుతూ.. ఖచ్చితమైన వివరాలు సేకరించి డాటా నమోదులో జాగ్రత్తలు పాటించాలని అన్నారు. సూపర్వైజర్ మరియమ్మ, ఆశవర్కర్లు పాల్గొన్నారు.