నల్లగొండ: ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అన్నింటిని రాజకీయ కోణంలో విమర్శించడం సమంజసం కాదని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును స్వాగతిస్తున్నానని చెప్పారు. జిల్లాలోని తన నివాసంలో ఆయన మాట్లాడారు. మాజీ ప్రధాని వాజ్పైయి ప్రభుత్వ హయాంలోనే నదుల ప్రక్షాళనకు అడుగు పడింది.