SRD: పటాన్చెరు మండలం ముత్తంగిలోని దివ్య వాణి చర్చిలో ఆదివారం చర్చి డైరెక్టర్, ఫాదర్ సిరిల్ ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం నుంచి వివిధ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో మహా దేవాలయం కిటకిటలాడింది. ఈ సందర్భంగా స్వస్థత, కుటుంబ సమస్యలపై ఫాదర్ ప్రత్యేక కూడికలు నిర్వహించారు.