ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని పెద్ద ట్యాంక్ వద్ద ఆదివారం సాయంత్రం 7అడుగుల కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ స్నేక్ క్యాచర్ నిరంజన్ కు సమాచారం ఇవ్వడంతో.. సంఘటన స్థలానికి చేరుకొని చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నారు. పట్టుకున్న కొండచిలువను అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలి వేయడం జరుగుతుందని నిరంజన్ తెలిపారు.