MDK: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో శిక్షణ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల బృందం పర్యటన నేడు ముగిసింది. ఆరుగురు సభ్యుల బృందం ఏడు రోజులపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించిన బృందం సభ్యులు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై సమాచారాన్ని సేకరించారు. పర్యటన విజయవంతంగా ముగిసినట్లు వారు తెలిపారు. సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వారికి సన్మానం చేశారు.