WGL: మంత్రి కొండా సురేఖను వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. గోపాలస్వామి గుడి తోట మైదానం పరిరక్షణ, వాకింగ్ ట్రాక్, తదితర ఏర్పాట్లను కల్పించాలని, వాకర్స్ అసోసియేషన్ సభ్యుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. గరిదాసు జయప్రకాష్, మర్రి వెంకటేశ్వర్లు, సల్లా కుమారస్వామి, రామగిరి ప్రకాష్ తదితరులు ఉన్నారు.