WNP: బాల్య వివాహాలను అవగాహనతోనే పూర్తిగా నిర్మూలించవచ్చని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ అన్నారు. గురువారం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఆర్డీఎస్ రూపొందించిన పోస్టర్ ను తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆర్డీఎస్ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ పాల్గొన్నారు.