కెనడా ఎన్నికల నుంచి తప్పుకోవాలంటూ సొంత పార్టీ నేతల నుంచే ప్రధాని ట్రూడోకు నిరసన వెల్లువెత్తుంది. అయినప్పటికీ రానున్న ఎన్నికల్లో లిబరల్ పార్టీకి సారథ్యం వహిస్తానని జస్టిన్ ట్రూడో తాజాగా ప్రకటించారు. దాదాపు 24 మంది పార్టీ సీనియర్ నేతలతో 3 గంటలపాటు ట్రూడో చర్చించారు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలని మెజార్టీ సభ్యులు సూచించారు. అయినప్పటికీ తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ప్రకటించారు.