కెనడాలోని భారతీయ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తాము నివశించే ప్రాంతం గురించి తెలుసుకోవాలని, ఖలిస్తానీ ఉగ్రవాదులు, తీవ్రవాదులు వారిని రాడికలైజ్ చేసే ప్రయత్నాల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలతో తరచూ మాట్లాడాలని, వారి పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలని కోరారు.