ADB: ఉట్నూర్ డిపోలో బస్సుల సంఖ్యను పెంచాలని ఆదివాసి ప్రజలు కోరారు. ఉట్నూర్ డిపో ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లే ప్రధానమార్గంలో ఉంది. అలాగే జైనూర్, నార్నూర్, లింగాపూర్, గాదిగూడ, సిర్పూర్ యు, సిరికొండ మండలాలకు బస్సు సౌకర్యం ఉండేది. డిపోలో బస్సుల సంఖ్యను తగ్గించడంతో ఆయా మండలాలకు సరైన రవాణా సౌకర్యం లేదన్నారు. బస్సుల సంఖ్యను పెంచాలన్నారు.