NRML: ప్రసూతి మరణాలు తగ్గించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రసూతి మరణాలు తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.