MBNR: తెలంగాణ వ్యాప్తంగా గ్రామపంచాయతీలలో ఎన్నో అభివృద్ధి కార్య క్రమాలు చేసి అప్పుల పాలైన మాజీ సర్పంచుల బాధలు వర్ణనాతీతమని సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ప్రణీత చందర్ అన్నారు. గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేసి దేశంలోనే ఆదర్శవంతమైన పంచాయతీలుగా తీర్చిదిద్దిన సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు.