BNR: పాఠశాలలు పరిశుభ్రంగా ఉండాలని యాదాద్రి భునవగిరి జిల్లా కలెక్టరు హనుమంత్ కే. జడేంగే ఆదేశించారు. మంగళవారం ఆయన వలిగొండ మండలం టేకులసోమారం జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. 9, 10వ తరగతులకు సంబంధించి సైన్స్, సోషల్ సబ్జెక్టులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చదువులో వెనుకబాటు ఉన్న పిల్లల పట్ల ప్రత్యేక తరగతుల తీసుకోవాలని సూచించారు.