చైనా అణ్వాయుధాల సంఖ్యను మరింతగా పెంచుకుంటున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పసిఫిక్ సముద్రంలో అత్యంత శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని చైనా విజయవంతంగా ప్రయోగించింది. PLA రాకెట్ ఫోర్స్ క్షిపణికి డమ్మీ వార్‌హెడ్‌ను అమర్చి ప్రయోగించింది. ఇది తాము అనుకున్న లక్ష్యాన్ని ఛేదించినట్లు చైనా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. తమ వార్షిక శిక్షణ ప్రణాళికల్లో భాగంగా దీన్ని చేపట్టామని పేర్కొంది.