TG: మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ ఆలయం వరుసగా రెండో రోజూ జలదిగ్బంధంలో ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు వదలటంతో ఆలయం ఎదుట మంజీర నదీపాయ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో గర్భగుడిలోకి వరద నీరు చేరింది. దీంతో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అర్చకులు పూజలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ నెల ప్రారంభంలో కురిసిన భారీ వర్షాలకు 12రోజులు ఆలయం మూతపడిన విషయం తెలిసిందే.