TG: హైదరాబాద్‌ను మురికి నీటిరహిత నగరంగా మార్చాలనే లక్ష్యంతో STPలను ప్రారంభించినట్లు మాజీమంత్రి KTR తెలిపారు. ఫతేనగర్‌లోని STPని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘BRS హయాంలో 31 STPల నిర్మాణం చేపట్టాం. రూ.3,866 కోట్లతో మురుగు నీటి శుద్ధి కార్యక్రమం ప్రారంభించాం. STPల పెండింగ్ పనులను ప్రస్తుత ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలి. ప్రభుత్వం మూసీ సుందరీకరణకు రూ.వేల కోట్లు అంటే అనుమానం వస్తోంది’ అని అన్నారు.