ADB: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి విక్రయించే రైతులకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషాను సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు కోరారు. ఈ విషయంపై కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తేమ నిబంధనతో పత్తి రైతులకు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.