మహబూబ్‌నగర్ అర్బన్ అథారిటీకి నూతనంగా ఛైర్మన్‌గా నియమితులైన మహబూబ్‌నగర్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ యాదవ్‌ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ శనివారం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కష్టపడే వారికి సముచిత స్థానం ఇస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు కిరణ్, రామస్వామి,యాదగిరి పాల్గొన్నారు.