NZB: ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. మనమందరం ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె గంగారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.