KNR : కరీంనగర్ బాలసదనంకు చెందిన 10 ఏళ్ల బాలికను కరీంనగర్ జిల్లాకు చెందిన దంపతులకు గత ఆగస్టులో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చారు. అందుకు సంబంధించిన దత్తత ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి క్యాంప్ ఆఫీసులో శనివారం అందించారు. ఈ సందర్భంగా బాలిక చదువు, తల్లీ తండ్రులతో ఉన్న అనుబంధం గురించి అడిగి తెలుసుకున్నారు.