NLG: తెలంగాణ రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు, కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాదులో ప్లాజాహోటల్ నుండి అంతర్జాతీయ బౌద్ధక్షేత్రమైన నాగార్జునసాగర్ హిల్ కాలనీ వరకు 200 బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో రాష్ట్ర పర్యాటక ఎండి ప్రకాష్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.