NLG: ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ రాంనగర్ (RSETI) లో పదవ తరగతి పాసైన గ్రామీణ మహిళలకు జ్యూట్,పేపర్ బ్యాగ్ తయారీలో 13 రోజుల ఉచిత శిక్షణ అందిస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి శనివారం తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం ఉంటుందని, ఉమ్మడి నల్లగొండకు చెందిన 19 నుండి 45 ఏళ్ల లోపు వారు అర్హులని సెప్టెంబర్ 28 లోపు ఆఫీసులో సంప్రదించాలన్నారు.