లిచీ పండ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో విటమిన్-C, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, ఐరన్ పుష్కలంగా ఉండటంతో ఎముకలు దృఢంగా ఉండటంలో సహకరిస్తాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులను రాకుండా చేస్తాయి. టైఫాయిడ్, కలరా, డయేరియా బారిన పడకుండా రక్షిస్తాయి. రొమ్ము క్యాన్సర్‌ను నివారిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.