KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయి యోగ పోటీలకు ఎంపికయ్యారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉనాలో జరుగుతున్న 49వ సబ్- జూనియర్, జూనియర్ నేషనల్ యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో అండర్-12 విభాగంలో తెలంగాణ రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించే నలుగురు విద్యార్థులకు దారం సుశీలా దేవి ఛారిటబుల్ ట్రస్ట్ యోగా సూట్లను అందించింది.