హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి ఆవరణలో మరో గుర్తుతెలియని డెడ్ బాడీ వెలుగు చూసింది. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీ ఓపీ బ్లాక్ ఎదురుగా కిందపడి ఉన్న 55 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడీని సెక్యూరిటీ సూపర్వైజర్ సుబ్బారావు గమనించి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వివరాలు ఏమీ లేకపోవడంతో డెడ్ బాడీని మార్చురీకి తరలించి భద్రపరిచారు.