ADB: ఆదిలాబాద్ రూరల్ మండలం అంకాపూర్ గ్రామం నుంచి పందిర్లోద్ది గ్రామానికి వెళ్లే రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు కోతకు గురైంది. దీంతో వాహనదారులకు రాత్రి వేళలో ప్రయాణించడానికి ఇబ్బందిగా మారింది. ప్రమాదాలు జరగక ముందే అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.