MBNR: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. మంగళవారం దేవరకద్ర లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడారు. ధాన్యం సేకరణ ప్రక్రియ సాఫీగా పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని ఆమె సూచించారు.