మెదక్: దివ్యాంగులను గుర్తించి అర్హులైనవారికి సదరం ధ్రువీకరణ పత్రం అందించేందుకు ఈ నెల 26, 29వ తేదీల్లో మెదక్‌లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. మీ- సేవ, ఈ- సేవ కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకుని కేటాయించిన తేదీల్లో రావాలన్నారు.