MBNR: జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ విజయేంద్రబోయి తెలిపారు. సోమవారం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 6 నుంచి ఇండ్ల జాబితా, యజమాని, చిరునామా వివరాలు సేకరించి ఇంటికి సర్వే స్టిక్కర్ అతికిస్తామన్నారు. సర్వే నిర్వహించేందుకు ఇంటికి వచ్చిన సిబ్బందికి ఆధార్, రేషన్, వివరాలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.