JGL: భక్తులతో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్య క్షేత్రం కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో వేకువ జామునే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా స్థానిక దైవం నరసింహస్వామి ఆలయంతో పాటు అనుబంధాలయాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.