హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ (Azharuddin)నేతృత్వం వహిస్తున్న కమిటీని రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుత కమిటీ స్థానంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు( Supreme Court) వెల్లడించింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ (Azharuddin)నేతృత్వం వహిస్తున్న కమిటీని రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుత కమిటీ స్థానంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు( Supreme Court) వెల్లడించింది. మాజీ జడ్జి లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఇకపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలను కమిటీ చూసుకుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ నాగేశ్వరరావు కమిటీ నివేదిక ప్రకారం తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. త్వరలోనే హెచ్‌సీఏకు ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. గత కొన్నాళ్లుగా హైదరాబాద్ క్రికెట్ ( Cricket) సంఘం అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే. పాలకవర్గంలో లుకలుకలు, ఆర్థిక అవకతవకలు, మ్యాచ్ ల నిర్వహణలో అక్రమాలు, అవినీతి… ఇలా అనేక అంశాలకు హెచ్ సీఏ వేదికగా మారింది. అటు, దేశవాళీల్లో హైదరాబాద్ క్రికెట్ జట్టు ప్రదర్శన నానాటికీ తీసికట్టు అన్న చందంగా తయారైంది.
ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు ప్రక్షాళనకు ఉపక్రమించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేసింది. ప్రస్తుత కమిటీ స్థానంలో ఏకసభ్య కమిటీని నియమిస్తూ సుప్రీం ధర్మాసనం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు (Lau Nageswara Rao) సభ్యుడిగా ఉంటారు. ఇకమీదట హెచ్ సీఏ కార్యకలాపాలు ఈ ఏకసభ్య కమిటీనే చూసుకుంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ రూపొందించే నివేదికను పరిశీలించిన తర్వాత, తమ తదుపరి చర్యలు ఉంటాయని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఒకప్పుడు అజహరుద్దీన్, ఎంఎల్ జయసింహ, వీవీఎస్ లక్ష్మణ్, (VVS Laxman) వెంకటపతిరాజు వంటి ప్రఖ్యాత క్రికెటర్లను అందించిన హైదరాబాద్ సంఘం అంతర్గత కుమ్ములాటలతో క్రికెట్ వ్యవహారాలను పక్కనబెట్టిందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. జట్టు ఎంపికలోనూ రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.హైదరాబాద్: సుప్రీంకోర్టులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు ఎదురు దెబ్బ తగిలింది. మహబూబ్‌నగర్ జిల్లా క్రికెట్ సంఘానికి గుర్తింపు ఇచ్చే విషయంలో హెచ్‌సీఏ వాదనను కొట్టి వేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఫలితంగా ఎ. వెంకటేశ్వర రెడ్డి నేతృత్వంలోని పాత కమిటీకే గుర్తింపు ఇస్తున్నట్లు కోర్టు ఆదేశించింది.
వివరాల్లోకెళితే…2008లో ఎం. వెంకటేశ్వర రెడ్డి కార్యదర్శిగా ఉన్న మహబూబ్‌నగర్ (Mahbubnagar) జిల్లా క్రికెట్ సంఘం గుర్తింపును అప్పటి హెచ్‌సీఏ కార్యదర్శి శివలాల్ యాదవ్ రద్దు చేశారు. అనంతరం ఐదుగురితో అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీ మొత్తం 77 మందికి సంఘంలో గుర్తింపు ఇచ్చింది. ఇందులో సభ్యులు కావాలంటే కనీసం రెండు అంతర్ జిల్లా టోర్నీలు ఆడి ఉండాలని నిబంధన కూడా విధించారు. అయితే అడ్హాక్ కమిటీలో సభ్యుడిగా ఉన్న వెంకటేశ్వర రెడ్డి (Venkateswara Reddy) ప్రతిపాదించిన పేర్లను మాత్రం పరిశీలనలోకి తీసుకోలేదు. అనంతరం అదే సభ్యులతో అడ్హాక్ కమిటీ ఎన్నికలను కూడా ప్రకటించింది. దాంతో వెంకటేశ్వర రెడ్డి వర్గం స్థానిక కోర్టును ఆశ్రయించింది. ఆ కోర్టుతో పాటు హైకోర్టులో కూడా జిల్లా సంఘానికి అనుకూలంగా తీర్పు వచ్చింది.దాంతో హెచ్‌సీఏ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. తాజా తీర్పు ప్రకారం వెంకటేశ్వర రెడ్డి కార్యదర్శిగా ఉన్న నాటి సంఘమే అసలైందని, ఆ కమిటీకి ఇప్పుడు ఎన్నికలు ప్రకటించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ‘అప్పట్లో శివలాల్ అన్యాయంగా మమ్మల్ని తొలగించారు. ఇప్పుడు మాకు అనుకూలంగా తీర్పు రావడం ఆనందంగా ఉంది. వారం రోజుల్లోపే అధికారులను పంపి ఎన్నికలు నిర్వహిస్తామని హెచ్‌సీఏ కార్యదర్శి ఎంవీ శ్రీధర్ మాకు చెప్పారు’ అని వెంకటేశ్వర రెడ్డి వెల్లడించారు.