తెలంగాణలోని ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. అభ్యర్థులు చేసిన న్యాయ పోరాటం ఫలించింది. హైకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థులకు కలిపేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రిలిమినరీ పరీక్షల్లో 7 ప్రశ్నల విషయంలో వివాదం తలెత్తింది. ప్రశ్నలకు సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్‌లో ఒకటికంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్నాయి. అయితే, వాటిలో తాము నిర్ధరించుకున్న వాటిని మాత్రమే సరైన సమాధానంగా పరిగణిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనిపై పరీక్షకు హాజరైన అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఒకటికంటే ఎక్కువ సరైన సమాధానాలున్నప్పుడు ఏదో ఒక దానిని మాత్రమే సమాధానంగా గుర్తించడం సరికాదని, దీనివల్ల ఇతర సమాధానాలు ఎంపిక చేసుకున్న వాళ్లు అన్యాయానికి గురవుతారని వాదించారు. ఈ విషయంలో న్యాయం చేయాలని కోరుతూ అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆ ఏడు ప్రశ్నల విషయంలో ఏ సరైన సమాధానం రాసినా సరే వారికి అదనంగా ఏడు మార్కుల వరకు కలపాలని ఆదేశించింది. దీంతో మరింత మంది అభ్యర్థులు ఫిజికల్ టెస్టులకు అర్హత సాధించనున్నారు. వీరికి ఫిబ్రవరి 15 నుంచి పోలీసు బోర్డు ఫిజికల్ టెస్టులు నిర్వహించనుంది