మొయినా బాద్ ఫాంహౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీనే ఎమ్మెల్యేల కొనుగులకు ప్రయత్నించిందటూ ఆరోపణలు వస్తున్నాయి. కాగా… ఈ ఘటనకు సంబంధించి స్పెషల్ ఇవ్వేస్టిగేషన్ టీమ్ తో విచారణ చేయించాలని హైకోర్టులో బీజేపీ గురువారంనాడు రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ పోలీసుల తీరుపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందం నియమించేలా ఆదేశాలు జారీ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.
మొయినాబాద్ పాం హౌస్ లో టీఆర్ఎస్(trs) ఎమ్మెల్యేలను ప్రలోభాలు గురి చేసేందుకు ముగ్గురు ప్రయత్నించారనే అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారం మేరకు సైబరాబాద్ పోలీసులు బుధవారంనాడు రాత్రి మొయినాబాద్ కు చేరుకొని ప్రలోభ పెట్టిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది.
ఇక తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి(Rohit Reddy)కి ప్రభుత్వం భద్రత పెంచింది. ఈ మేరకు హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రోహిత్ రెడ్డి 2+2 సెక్యూటిటి ఉంది. అయితే దీనిని 4 +4 కు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. భద్రత పెంపుతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ను కూడా రోహిత్ రెడ్డికి కేటాయించింది.