ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ తీహార్ జైలులో ఉంటూనే లేఖలతో ప్రకంపనలు రేపుతున్నాడు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చేసిన చాట్‌కు సంబంధించి లేఖ విడుదల చేయగా.. ఇప్పుడు మరో లేఖ బయటకు వచ్చింది.
తల్లిదండ్రుల పొరపాటు వలన ఆ సంఘటన జరిగింది. ఆస్పత్రి సిబ్బంది, ప్రభుత్వం తప్పిదం ఎక్కడా లేదు అంటూ నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సంఘటనపై సూపరింటెండెంట్ వివరణ ఇచ్చారు.
రంజాన్ (Ramzan 2023) వచ్చిందంటే చాలు.. హైదరాబాద్(Hyderabad)లోని అనేక వ్యాపార సముదాయాలు రద్దీగా మారిపోతుంటాయి. అయితే.. గత మూడేళ్లుగా కొవిడ్ మహమ్మారి కారణంగా సరైన వ్యాపారాలు లేక నిరాశ చెందిన వారికి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు.
యేటా రూ.11 వేల కోట్ల బడ్జెట్ అంటూనే.. రోగికి వీల్ చైర్ కూడా అందించలేని దరిద్రపు పాలన. ఇది మీరు చెప్తు ఆరోగ్య తెలంగాణ కాదు.. ప్రజలు చూస్తున్న అనారోగ్య తెలంగాణ
పోరుగడ్డ ఓరుగల్లు నుంచే నిరుద్యోగ మార్చ్ (Unemployment march) రూపంలో నిరసనలకు బీజేపీ BJP) శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం 4గంటలకు కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్ నుంచి హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వరకు మార్చ్ కొనసాగనుంది. బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ మార్చ్ ర్యాలీలో వేలాది మంది నిరుద్యోగులను స్వచ్ఛందంగా పాల్గొనేలా వారం రోజుల పాటు ఉమ్మడి వర...
కలుషిత వ్యర్థ జలాలను సంపూర్ణంగా శుద్ధి చేసేందుకు ఒక సమగ్రమైన పరిషారాన్ని సిద్ధం చేసిన జీహెచ్‌ఎంసీ, 2020లో సుమారు రూ.250 కోట్లతో జవహర్‌నగర్ డంప్‌యార్డులో వ్యర్థ జలాల ట్రీట్‌మెంట్, మలారం చెరువుతో పాటు కృత్రిమ నీటి గుంటల రిస్టోరేషన్, శుద్ధి కార్యక్రమాన్ని రాంకీ సంస్థ చేపట్టింది. సంవత్సర కాలంగా కొనసాగుతున్న పనుల్లో భాగంగా ఇప్పటికే 43% మేర మలారం చెరువు శుద్ధి పూర్తయింది.
ఆర్టీసీ ఉద్యోగులకు (RTC employees) శుభవార్త ప్రభుత్వం చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ (PRC) ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా టీఎస్ ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ (Bajireddy Govardhan) తెలిపారు.ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన తెలిపారు
కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి అక్కడున్న కళాకారుల దగ్గరకు వెళ్లి జై భీమ్ అంటే ఏమిటి? అని ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రశాంతంగా సాగుతున్న సభను అడ్డుకోవడం ఏంటని ఇది సరైన పద్దతి కాదని ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డిని మునగాల ఎస్సై లోకేష్(Lokesh) చెప్పారు. దీంతో అక్కడ గందగోళ పరిస్థితి నెలక...
ఇందూరు ప్రభుత్వాసుపత్రిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తామన్న ప్రజాప్రతినిధులు ఆ ఊసే మరిచారు. అన్ని హంగులు ఉన్నాయని బయటకు మెరుస్తుతున్నా సిబ్బంది లేక వైద్యులు రాక రోగులు (Patients) పడుతున్న బాధలు అంతా ఇంతా కాదు. ఓ వైపు సర్కారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో భేష్ అని గొప్పలు చెప్పుకుంటున్నా.... ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రి(Government Hospital) లో కనీసం స్ట్రెచర్ లేకపోవటం ఆందోళనకు గురి చేస్తోంది.
టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ల లీక్ తీవ్ర సంచలనం సృష్టించినది తెలిసిందే. దీనిపై సిట్దర్యాప్తులో భాగంగా బోర్డు ఉద్యోగులతోపాటు మొత్తం 17 మందిని అరెస్టు చేసింది. చివరగా అరెస్టు అయిన సుస్మిత, లౌకిక్దంపతులను కోర్టు అనుమతితో శుక్రవారం కస్టడీకి తీసుకుని విచారించారు.
ప్రపంచంలోనే ప్రప్రథమంగా బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ 125 అడుగుల మహా విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం ఆవిష్కరించారు. అంబేడ్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ హాజరవగా.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ(Telangana)లోని వికారాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ(Hyderabad weather Department) ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, పలుచోట్ల వడగండ్లు సైతం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తాను వైఎస్సార్ తెలంగాణగా పార్టీలో చేరటం లేదని తేల్చి చెప్పారు పొంగులేటి. వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరకపోడవంపై షర్మిల కోపంగా ఉందని.. మొహమాటానికి చేరి తన గొంతు తానే కోసుకోలేనని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పొంగులేటి (Ponguleti) పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
దళితులకు సీఎం కేసీఆర్ (CM KCR) ఏం చేయలేదని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (MP Komati Reddy) విమర్మించారు. అంబేద్కర్ విగ్రహం(Ambedkar statue) పెట్టినంత మాత్రన వారికి అండగా నిలిచినట్లా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా దళితుడిని చేశామని ఆయన అన్నారు.